ఆర్టికల్‌ 29, 30కి తూట్లు పొడిచే కుట్ర

ABN , First Publish Date - 2020-02-22T07:35:11+05:30 IST

మైనారిటీల రక్షణ, సంక్షేమం కోసం అంబేద్కర్‌, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌లు రాజ్యాంగంలో పొందుపరిచిన 29, 30 అధికరణలకు తూట్లు పొడిచే కుట్ర జరుగుతోందని ఎంఐఎం అధినేత...

ఆర్టికల్‌ 29, 30కి తూట్లు పొడిచే కుట్ర

మైనారిటీలు ఐకమత్యాన్ని కోల్పోతే.. ఉనికికే ముప్పు : అసదుద్దీన్‌ ఒవైసీ 


బర్కత్‌పుర, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): మైనారిటీల రక్షణ, సంక్షేమం కోసం అంబేద్కర్‌, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌లు రాజ్యాంగంలో పొందుపరిచిన 29, 30 అధికరణలకు తూట్లు పొడిచే కుట్ర జరుగుతోందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. వాటిపై పార్లమెంటులో చర్చ జరుగుతుండగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ‘అంత అవసరమా?’ అని వ్యాఖ్యానించడంలోనే అసలు కుట్ర దాగి ఉందని ఆయన విమర్శించారు. శుక్రవారం రాత్రి ఎల్బీ స్టేడియంలో క్రైస్తవుల అభివృద్ధి, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలంటూ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో ప్రేయర్‌ డే నిర్వహించారు. క్రిస్టియన్‌ ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒవైసీ మాట్లాడారు. మైనారిటీలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఐకమత్యాన్ని కోల్పోతే మైనారిటీల ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్నారు. 

Updated Date - 2020-02-22T07:35:11+05:30 IST