Abn logo
Jul 6 2020 @ 03:21AM

ఐపీఎల్‌ సొమ్ము మా జేబుల్లోకి పోదు

విమర్శకులపై బీసీసీఐ కోశాధికారి ఆగ్రహం

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ అంటే కేవలం కాసులు కురిపించే లీగ్‌ అని విమర్శిస్తున్న వాళ్లపై బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ మండిపడ్డాడు. ఆ లీగ్‌ ద్వారా వచ్చే సొమ్ము తమ జేబుల్లోకి రాదని.. ఆటగాళ్లతో  పాటు దేశ సంక్షేమానికి ఆ డబ్బు ఉపయోగపడుతోందని అన్నాడు. ‘ఐపీఎల్‌ అంటే డబ్బులు ఉత్పత్తి చేసే యంత్రంలా చాలామంది మాట్లాడుతున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయం గంగూలీకో, జై షాకో లేదంటే నా జేబులోకో రాదు. ఈ లీగ్‌ వల్ల ఆటగాళ్లతో పాటు పర్యాటకం, రవాణాలాంటి రంగాలకు మేలు చేకూరుతోంది. బీసీసీఐ పన్నుల రూపేణా ప్రభుత్వానికి వేల కోట్లు చెల్లిస్తోంది. ఇదంతా దేశ సంక్షేమం కోసం వెచ్చిస్తున్నట్టు కాదా? క్రీడలపై ఖర్చు చేస్తే.. అది మరింత సంపదను సృష్టిస్తుంది’ అని ధూమల్‌ ఘాటుగా వ్యాఖ్యానించాడు. 

Advertisement
Advertisement
Advertisement