హైదరాబాద్: 317 జీవోను సవరించాలంటూ ప్రగతి భవన్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీచర్లను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నేత బండి సంజయ్ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అరెస్టు చేసిన టీచర్లందరినీ ప్రభుత్వం తక్షణమే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ‘స్థానికత’కు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను వెంటనే సవరించాలన్నారు. 317 జీవోను సవరించే దాకా ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసే ఉద్యమానికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. 317 జీవోను సవరించేదాకా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న పోరాటాలను ఉధృతం చేస్తామని సంజయ్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి