ఏటీఎం కార్డు మోసగాళ్ల అరెస్ట్

ABN , First Publish Date - 2021-06-26T02:20:51+05:30 IST

పలువరిని మోసం చేస్తున్న ఇద్దరు ఏటీఎం కార్డు మోసగాళ్లను మాదాపూర్ డీసీపీ నేతృత్వంలోని టీమ్

ఏటీఎం కార్డు మోసగాళ్ల అరెస్ట్

సైబారాబాద్: పలువురిని మోసం చేస్తున్న ఇద్దరు ఏటీఎం కార్డు మోసగాళ్లను మాదాపూర్ డీసీపీ నేతృత్వంలోని టీమ్ పట్టుకున్నట్లు సీపీ సజ్జన్నార్ తెలిపారు. వారి నుంచి 319 ఏటీఎం కార్డులు, పే టీఎం, స్కానింగ్, స్వైపింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నామని సీపీ పేర్కొన్నారు. తన బంధువు అయిన కొందరెడ్డితో కలిసి తాళ్ల శ్రీనివాస్ రెడ్డి  ఈ మోసాలకు పాల్పడ్డారని సీపీ వివరించారు. షేక్‌పేట్‌లోని రూమ్‌లో ఉంటూ అనేక దొంగతనాలకు స్కెచ్ వేశారని ఆయన పేర్కొన్నారు. స్వైపింగ్ మిషన్లతో కార్డుల్ని దొంగిలించి డబ్బులు దండుకుంటారని ఆయన వివరించారు. ఇందుకోసం రెండు కిరణా షాపుల్ని రిజిస్టర్ చేసుకున్నారన్నారు. ఏటీఎం సెంటర్లలో మర్చిపోయిన కార్డుల్ని తెచ్చి స్వైప్ చేసేవాళ్లని సీపీ తెలిపారు.


 కేపీహెచ్‌బీ, మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్‌పేట్‌లో ఉన్న ఏటీఎం‌ సెంటర్లలో కార్డుల కోసం తిరిగే వారన్నారు. ఆ ఎమౌంట్‌ను సిటీ, కోటాక్ మహీంద్రా బ్యాంకులకు ట్రాన్స్‌ఫర్ చేసేవారని ఆయన వివరించారు. కార్డుదారులు తమ కార్డుల్ని బ్లాక్ చేసేవరకూ స్వైప్ చేసేవారని ఆయన తెలిపారు. వీరిపై 9 కేసుల్ని గుర్తించామన్నారు.  వీరిపై కూకట్‌పల్లిలో 2, కేపీహెబీలో 4, రాయదుర్గంలో 3 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఏ1 శ్రీనివాస్ రెడ్డి 6.87 లక్షలు, ఏ2 కొండ రెడ్డి 1.50 లక్షలు స్వైప్ చేసారని ఆయన పేర్కొన్నారు. ఏటీఎం సెంటర్స్ వద్ద ప్రజలు   అప్రమతంగా ఉండాలని సీపీ సజ్జన్నార్ హెచ్చరించారు. 

Updated Date - 2021-06-26T02:20:51+05:30 IST