ఐసీయూలో ఆర్చర్‌ తాలుక్‌దార్‌

ABN , First Publish Date - 2021-05-04T09:35:21+05:30 IST

మాజీ ఒలింపియన్‌, వరల్డ్‌కప్‌ స్వర్ణ పతక విజేత అయిన ఆర్చర్‌ జయంత్‌ తాలుక్‌దార్‌ (35) కరోనా బారినపడ్డాడు. అతడి ఆరోగ్య పరిస్థితి

ఐసీయూలో ఆర్చర్‌ తాలుక్‌దార్‌

గువాహటి: మాజీ ఒలింపియన్‌, వరల్డ్‌కప్‌ స్వర్ణ పతక విజేత అయిన ఆర్చర్‌ జయంత్‌ తాలుక్‌దార్‌ (35) కరోనా బారినపడ్డాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు జయంత్‌ తండ్రి రంజన్‌ తాలుక్‌దార్‌ తెలిపాడు. ‘ఆక్సిజన్‌ అందిస్తే బాగానే ఉంటోంది. కానీ, సిలెండర్‌ తీసేస్తే మళ్లీ స్థాయిలు పడిపోతున్నాయ’ని రంజన్‌ చెప్పాడు. ఒలింపిక్స్‌ టీమ్‌లో చోటు దక్కక పోవడంతో జయంత్‌ నెలరోజుల క్రితం ఇంటికి చేరుకొన్నాడు.

Updated Date - 2021-05-04T09:35:21+05:30 IST