Tokyo Paralympics: ప్రి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన ఆర్చర్ రాకేశ్ కుమార్

ABN , First Publish Date - 2021-08-28T20:59:25+05:30 IST

జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత విలువిద్య క్రీడాకారుడు రాకేశ్ కుమార్ ప్రి క్వార్టర్స్‌లోకి

Tokyo Paralympics: ప్రి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన ఆర్చర్ రాకేశ్ కుమార్

టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత విలువిద్య క్రీడాకారుడు రాకేశ్ కుమార్ ప్రి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. అతడి సహచరుడు శ్యామ్ సుందర్ స్వామి మాత్రం రెండో రౌండ్ నుంచే వెనుదిరిగాడు. హాంకాంగ్ క్రీడాకారుడు కా చుయెన్ ఎంగైతో జరిగిన గేమ్‌లో 36 ఏళ్ల రాకేశ్ కుమార్ 13 పాయింట్ల భారీ తేడాతో విజయం సాధించాడు. కుమార్ ఈ ఏడాది మొదట్లో దుబాయ్‌లో జరిగిన ఫజ్జా పారా అర్చరీ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంటులో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించాడు.  


అంతకుముందు 21వ సీడ్ సుందర్ 2012 పారాలింపిక్స్ రజత పతక విజేత మట్ స్టట్జ్‌మన్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడు. రెండో రౌండ్‌లో బై సాధించిన సుందర్ 139-142 పాయింట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యాడు. అమెరికాకు చెందిన మట్‌కు చేతులు లేవు. కాళ్లతోనే బాణాన్ని సంధించి విజయం సాధించడం విశేషం. 

Updated Date - 2021-08-28T20:59:25+05:30 IST