పరస్పర ప్రయోజనాలు నెరవేర్చేదే మధ్యవర్తిత్వం: జస్టిస్‌ భుయాన్‌

ABN , First Publish Date - 2022-05-15T08:40:16+05:30 IST

మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కోసం వచ్చిన ఇరుపక్షాల కక్షిదారుల ప్రయోజనాలు నెరవేరుతాయని హైకోర్టులో రెండో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ అన్నారు.

పరస్పర ప్రయోజనాలు నెరవేర్చేదే  మధ్యవర్తిత్వం: జస్టిస్‌ భుయాన్‌

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కోసం వచ్చిన ఇరుపక్షాల కక్షిదారుల ప్రయోజనాలు నెరవేరుతాయని హైకోర్టులో రెండో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ అన్నారు. శనివారం నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఇంటర్నేషన్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌(ఐఏఎంసీ)లో యువ న్యాయవాదులు, మీడియేటర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మధ్యవర్తిత్వం అంటే హక్కుల ఆధారంగా కొనసాగే పరిష్కార మార్గం కాదని.. ప్రయోజనాల ఆధారంగా సాగే పరిష్కార మార్గమని తెలిపారు.మధ్యవర్తిత్వం ప్రాధాన్యాన్ని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు చేర్చేందుకు ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) హైదరాబాద్‌ చర్యలు చేపట్టింది. మధ్యవర్తిత్వంలో యువతను భాగస్వాములుగా చేయడంలో భాగంగా యంగ్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (వైఐఏఎంసీ)ను ఏర్పాటు చేసింది.  

Updated Date - 2022-05-15T08:40:16+05:30 IST