Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీఆర్వోలను ఉద్దేశిస్తూ మంత్రి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు

శ్రీకాకుళం: వీఆర్వోలను ఉద్దేశిస్తూ పలాసలో మంత్రి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. సచివాలయానికి వచ్చిన వీఆర్వోలను వైసీపీ ప్రజా ప్రతినిధులు తరిమికొట్టిస్తారా? మిమ్మలను ప్రజాప్రతినిధులుగా గెలిపించి మంత్రిని చేసింది ఇందుకేనా? అని ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్, మంత్రి వెంటనే వీఆర్వోలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. లేకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. వారి మాటలకు నిరసనగా రేపు రాష్ట్రంలో ఉన్న అందరు వీఆర్వోలు నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తామన్నారు. సెలవు దినాలు పండగలు చూడకుండా రాత్రి పగలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు.  వీఆర్వోలపై ఇలా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదన్నారు. సీఎం స్పందించి ఇలాంటి మంత్రి, అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. 


Advertisement
Advertisement