Advertisement
Advertisement
Abn logo
Advertisement

భువనేశ్వరికి క్షమాపణ చెబుతున్నా: వల్లభనేని వంశీ

విజయవాడ: ‘నేను అలా మాట్లాడి ఉండకూడదు.. పొరపాటున ఓ మాట దొర్లాను.. అలా మాట్లాడటం తప్పే..! ఎవరు అలా మాట్లాడినా తప్పే.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి క్షమాపణ చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. నాకు అందరికన్నా ఎక్కువ పరిచయం ఆమెతోనే ఆమెను అక్కా అని పిలిచేవాడిని.. ఆమెతోపాటు నా మాటల వల్ల బాధపడిన వారందరికీ క్షమాపణ చెబుతున్నా..’ అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. బుధవారం ఓ చానల్‌లో జరిగిన డిబేట్‌లో వంశీ మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం నారా భువనేశ్వరిని ఉద్దేశించి వంశీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. వంశీ వ్యాఖ్యలకు కొనసాగింపుగా అసెంబ్లీలో పలువురు వైసీపీ మంత్రులు.. ఎమ్మెల్యేలు భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేయడం.. వాటిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా కలతచెందిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement