జమ్ములో అపోలో హాస్పిటల్
ABN , First Publish Date - 2022-04-28T07:11:26+05:30 IST
జమ్ము కశ్మీర్‌లో 370వ అధికరణం రద్దయిన తర్వాత అక్కడ మొట్టమొదట ప్రాజెక్టు కోసం భూమిని సేకరించిన కంపెనీల్లో ఒకటిగా అపోలో హాస్పిటల్ నిలిచింది.
జమ్ము : జమ్ము కశ్మీర్‌లో 370వ అధికరణం రద్దయిన తర్వాత అక్కడ మొట్టమొదట ప్రాజెక్టు కోసం భూమిని సేకరించిన కంపెనీల్లో ఒకటిగా అపోలో హాస్పిటల్ నిలిచింది. జమ్ము జిల్లాలో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌నకు జమ్ము పాలనా యంత్రాంగం ఇప్పటికే జమ్ములోని మిరాన్ సాహిబ్ మెడి సిటీలో 12.5 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 46 ఎకరాల స్థలంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ మెడిసిటీ ఏర్పాటవుతున్నట్టు వారు చెప్పారు. అపోలో హాస్పిటల్‌తో పాటు జేఎ్‌సడబ్ల్యూ స్టీల్ కూడా రూ.150 కోట్లతో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించేందుకు ముందుకు వచ్చిందని, ఆ సంస్థకు ఇప్పటికే 8.75 ఎకరాల స్థలం కేటాయించామని వారు తెలిపారు.