APCPS employees చలో విజయవాడ వాయిదా

ABN , First Publish Date - 2022-08-30T03:06:43+05:30 IST

ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం చేపట్టనున్న చలో విజయవాడ...

APCPS employees చలో విజయవాడ వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ (Apcps) ఉద్యోగుల సంఘం చేపట్టనున్న చలో విజయవాడ (Chalo Vijayawada) కార్యక్రమం వాయిదా పడింది. సీపీఎస్ హామీని ప్రభుత్వం నెరవేర్చాలంటూ ఉద్యోగుల సంఘం నాయకులు సెప్టెంబర్ 1న చలో విజయవాడకు పిలుపు నిచ్చారు. అయితే ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సీపీఎస్ ఉద్యోగులు ఎవ్వరూ సెప్టెంబర్ 1న చలో విజయవాడకు హాజరుకావద్దని సూచించారు. సెప్టెంబర్ 11న చలో విజయవాడ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు.


ఈ సందర్భంగా ఏపీసీపీఎస్‌ఈఏ (Apcpsea) అధ్యక్షుడు అప్పలరాజు (Appalaraju), ప్రధానకార్యదర్శి పార్దసారధి (parthasaradhi) మాట్లాడుతూ ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాలుగా సెప్టెంబర్ 1న శాంతియుత ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాలకు సీపీఎస్‌ రద్దును గుర్తు చేస్తున్నామని తెలిపారు. ప్రతీసారి పోలీసుల అనుమతి తీసుకొని నిరసనను కొనసాగిస్తున్నామన్నారు. ఈ సారి కూడా సెప్టెంబర్ 1న చలో విజయవాడ, మిలియన్‌ మార్చ్‌ పేరుతో సభ, ర్యాలీకి పోలీసుల అనుమతి కోరామని తెలిపారు. అయితే ఏ నిర్ణయం ప్రకటించకుండానే సీపీఎస్ ఉద్యోగులకు పోలీసులు నోటీసులు ఇచ్చారని చెప్పారు. బైండోవర్‌ కేసులతో పాటు చాలా కేసులు మోపుతున్నారని ఆరోపించారు. దీంతో ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఇబ్బందుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్ ఉద్యోగుల శ్రేయస్సు కోసం సెప్టెంబర్ 1న చేపట్టాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని అప్పలరాజు, పార్దసారధి స్పష్టం చేశారు. 


Updated Date - 2022-08-30T03:06:43+05:30 IST