ఏపీకే ఎక్కువ పెట్టుబడులు

ABN , First Publish Date - 2021-02-26T08:53:05+05:30 IST

పెట్టుబడుల ఆకర్షణలో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉందని పరిశ్రమలు, ఐటీ, చేనేత శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు...

ఏపీకే ఎక్కువ పెట్టుబడులు

  • ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి సిడ్బీతో ఒప్పందం: మేకపాటి 


అమరావతి, మంగళగిరి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): పెట్టుబడుల ఆకర్షణలో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉందని పరిశ్రమలు, ఐటీ, చేనేత శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. 2019 ఆగస్టు నుంచి ఇప్పటివరకూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల సదస్సులు నిర్వహించామన్నారు. ఎంఎ్‌సఎంఈల అభివృద్ధి కోసం చిన్నపరిశ్రమల అభివృద్ధి బ్యాంకు(సిడ్బీ)తో పరిశ్రమల శాఖ ఒప్పందం చేసుకుంది. పరిశ్రమలు, ఐటీ, చేనేత, జౌళి రంగాలపై మంత్రి మేకపాటి గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిడ్బీ సహకారంతో చిన్న పరిశ్రమల ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మరింత ప్రచారం వస్తుందన్నారు.


వర్క్‌ ఫ్రం హోమ్‌లో ఏపీ ముందంజ 

మంత్రి బొత్సతో కలిసి ఐఎ్‌సబీ ప్రొఫెసర్లు, ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి మేకపాటి సమావేశమయ్యారు. రిమోట్‌ వర్క్‌ సహా ప్రభుత్వానికి వివిధ రంగాల్లో ఐఎ్‌సబీ తోడ్పాటు గురించి ఆ సంస్థ ప్రతినిధులు ప్రజంటేషన్‌ ఇచ్చారు. వర్క్‌ ఫ్రంహోమ్‌ విషయంలో మిగతా రాష్ట్రాలకంటే ఏపీ ముందుందన్నారు. 


ఆప్కో బలోపేతానికి ప్రభుత్వ సహకారం

చేనేత పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న ఆప్కో సంస్థ బలోపేతానికి ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన ఆప్కో సంస్థపై సమీక్ష నిర్వహించారు. ముందుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆప్కో బలోపేతంలో భాగంగా.. ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తే చేనేత వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. అలాగే చేనేతపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న 2.5శాతం జీఎస్టీని రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి సరఫరా చేసే యూనిఫాంను తప్పనిసరిగా ఆప్కో నుంచి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆప్కో చైర్మన్‌ మోహన్‌రావు మాట్లాడుతూ ఇప్పటివరకూ ఆప్కోలో ఆర్థికపరమైన వివరాలకు సంబంధించిన లెక్కలు లేవన్నారు. దశల వారీగా చేనేత, ఆప్కో అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై మంత్రి చర్చించారు.


Updated Date - 2021-02-26T08:53:05+05:30 IST