Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ ఎస్ఈసీ నియామకంపై విచారణ వాయిదా

అమరావతి: ఎస్‌ఈ‌సీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని, డివిజన్ బెంచ్‌కి బదిలీ చేయాలని ఎస్‌ఈ‌సీ న్యాయవాది కోర్టును కోరారు. ఎన్నికల కమిషనర్ వ్యవహారాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చని ఈ సందర్భంగా హైకోర్టు తెలిపింది. ఇది ప్రజా ప్రయోజనాల కిందకి వస్తుందని, గతంలో పలు జడ్జిమెంట్లు ఉన్నాయని పిటిషనర్ తెలిపారు. జడ్జిమెంట్లు ఫైల్ చేయాలని పిటిషనర్‌కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. 

Advertisement
Advertisement