ఏపీలో 4 రోజులపాటు అక్కడక్కడ భారీ వర్షాలు..

ABN , First Publish Date - 2020-08-12T23:31:33+05:30 IST

ఏపీలో 4 రోజులపాటు అక్కడక్కడ భారీ వర్షాలు..

ఏపీలో 4 రోజులపాటు అక్కడక్కడ భారీ వర్షాలు..

గుంటూరు: వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో గురువారం అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో రాగల 4 రోజులపాటు ఏపీ రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉందని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వెల్లడించింది.


ఆగష్టు 13వ తేదీన విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.


ఆగష్టు 14వ తేదీన విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి  జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.


ఆగష్టు 15వ తేదీన విశాఖ, తూర్పు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి  భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.


ఆగష్టు 16వ తేదీన విశాఖ, తూర్పు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపింది.


Updated Date - 2020-08-12T23:31:33+05:30 IST