చార్జీల వాతలుపెట్టినా... విద్యుత్‌ కోతలెందుకో..!

ABN , First Publish Date - 2022-02-19T08:44:27+05:30 IST

‘‘ఒకపక్క కరెంటు చార్జీల పెంపుతో వాతలు పెట్టినా... మరోపక్క విద్యుత్‌ కోతలు ఎందుకు?’’ అని తెలుగుదేశం పార్టీ ....

చార్జీల వాతలుపెట్టినా... విద్యుత్‌ కోతలెందుకో..!

 హిందూజాను వదిలేసి అధిక ధరకు కొనుగోళ్లా: కళా

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ‘‘ఒకపక్క కరెంటు చార్జీల పెంపుతో వాతలు పెట్టినా... మరోపక్క విద్యుత్‌ కోతలు ఎందుకు?’’ అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఆయన శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో రూ.11 వేల కోట్ల మేర చార్జీల వాతలేసింది. చార్జీల వాతలు, అప్పులు, పంచాయతీల నుంచి లాగేసిన గ్రాంట్‌ కలిపి రూ.60 వేలు కోట్లు అయింది. అయినా కరెంటు కోతలంటే... మరి ఈ సొమ్మంతా ఏంచేసినట్లు జగన్‌రెడ్డీ..! హిందూజా నుంచి యూనిట్‌ రూ.3.83కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం ఉంటే... బయటి మార్కెట్‌ నుంచి రూ.15పెట్టి కొనుగోలు చేయడం వెనక చిదంబర రహస్యమేంటో చెప్పాలని కళా డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-02-19T08:44:27+05:30 IST