Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉక్కు కార్మికుల ‘వంటా వార్పు’

 ప్రైవేటీకరణ యత్నాలపై ఆందోళన

 బీజేపీ మినహా అన్ని పార్టీలు, సంఘాల మద్దతు


ఉక్కుటౌన్‌షిప్‌ (విశాఖపట్నం), నవంబరు 26: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉద్యోగులు, కార్మికులు ‘వంటా-వార్పు’ కార్యక్రమం నిర్వహించారు. రహదారిపై కూర్చుని భోజనం చేశారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రానాక్షన్‌, లీగల్‌ అడ్వయిజర్ల నియామకాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్టీల్‌ప్లాంట్‌ ప్రధాన మార్గాల్లో చేపట్టిన ఆందోళనకు కార్మికులు కుటుంబాలతో తరలివచ్చారు. కూర్మన్నపాలెం జంక్షన్‌ వద్ద మానవహారంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోరాట కమిటీ చైర్మన్లు సీహెచ్‌.నరసింగరావు, డి.ఆదినారాయణ, కన్వీనర్‌ అయోధ్యరామ్‌, కో-కన్వీనర్లు గంధం వెంకటరావు, కేఎ్‌సఎన్‌ రావు మాట్లాడుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, రెండు రోజుల్లో కార్యచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.

Advertisement
Advertisement