ఛాసిస్‌ విరిగేలా..!

ABN , First Publish Date - 2021-11-25T08:13:28+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వాహనదారులకు భా రీ షాక్‌ ఇస్తోంది. ద్విచక్రవాహనం....

ఛాసిస్‌ విరిగేలా..!

లైఫ్‌ ట్యాక్స్‌ పెంచారు.. గ్రీన్‌ ట్యాక్స్‌ వేశారు

రూ.50వేల బైకుపై 

9% నుంచి 13%కి పెంపు

లారీ కొంటే 12%ఉన్న ట్యాక్స్‌ 18%..

అదనపు భారం ఏటా రూ.410కోట్లు

అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పేర్ని


అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వాహనదారులకు భా రీ షాక్‌ ఇస్తోంది. ద్విచక్రవాహనం దగ్గర నుంచి లారీ వరకూ దేన్నీ వదలకుండా కొనుగోలు సమయంలో 4శాతం నుంచి ఆరు శాతానికి జీవిత ప న్ను పెంచుతోంది. యాభై వేల విలువైన బైకుపై ప్రస్తుతం 9శాతం చెల్లిస్తున్న పన్ను.. ఇకపై 13 శాతం అంటే రూ.4,500 నుంచి రూ.6,500కు పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రూ.20లక్షలకు మించి కొనుగోలు చేసే కార్లు లేదా లారీలకు ప్రస్తుతం ఆర్టీఏ 12శాతం పన్ను వసూ లు చేస్తోంది. ఇకపై 18శాతం చెల్లించక తప్పదు. ప్రస్తుతం రూ.30లక్షలు పెట్టి లారీ లేదా అంతకుమించిన మొత్తంతో ఏ వాహనం కొనుగోలు చేసి నా రూ.3.60లక్షల పన్ను చెల్లించాలి. ఇకపై ఆ మొ త్తాన్ని రూ.5.40లక్షలకు జగన్‌ సర్కారు పెంచబోతోంది. దీనికి తోడు గ్రీన్‌ టాక్స్‌ పేరుతో పర్యావరణ పరిరక్షణ నిమిత్తం పాత వాహనాలపైనా రూ.10 వేల వరకూ పన్ను విధిస్తున్నట్లు బుధవారం అసెంబ్లీలో మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టిన బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నుల ప్రకారం రూ.50వేల లోపు కొత్త బైకు కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆర్టీఏకి 9శాతం అంటే రూ.4,500 పన్ను చెల్లించాలి. రెండేళ్ల తర్వాత అదే వాహనాన్ని మరొకరికి యజమాని విక్రయిస్తే 8శాతం, మూడేళ్ల లోపయి తే 7శాతం, నాలుగేళ్లకు 6, ఐదేళ్లకు 5, ఆరేళ్లకు 4, ఏడేళ్లకు 3, ఎనిమిదేళ్లకు 2.5, తొమ్మిదేళ్లకు 2, పదేళ్లకు 1.5, పదకొండేళ్లకు  1శాతం పన్ను చెల్లించా లి. అదే విధంగా రూ.50వేల ఖరీదు దాటిన ఏ వాహనమైనా కొత్తగా కొనుగోలు చేసినప్పుడు 12 శాతం పన్ను ఉండగా ఆ తర్వాత ఏటా 11శాతం, 10శాతం, 9శాతం, 8శాతం, ఏడు, ఆరున్నర ఆరు, ఐదున్నర, ఐదు, నాలుగున్నర, నాలుగు శాతం చొప్పున పదకొండేళ్ల వరకు కొనుగోలుదారులు ఆర్టీఏకి పన్ను చెల్లిస్తున్నారు. ఈ రెండు విధానాలను ఇకపై నాలుగు మార్గాల్లో వసూలు చేసేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధమైంది. కనీస పన్ను 9శాతం నుంచి 13శాతానికి.. రెండో శ్లాబు 12ు నుంచి 14, 17, 18 శాతాలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. 


గ్రీన్‌ టాక్స్‌ బాదుడు

రాష్ట్రంలో ఏడేళ్లు దాటిన రవాణా వాహనాలు ప్రస్తుతం 20.31లక్షలు ఉన్నాయని, పర్యావరణ కాలుష్య నియంత్రణ కోసం వాటిపై అదనంగా గ్రీన్‌ టాక్స్‌ వేయబోతున్నట్లు వైసీపీ ప్రభుత్వం వెల్లడించింది. 15ఏళ్లు దాటిన సొంతవాహనాలకు గ్రీన్‌ టాక్స్‌ తప్పదని స్పష్టం చేసింది. రవాణా వాహనాలు(ఎల్లో బోర్డు) ఏడేళ్లు దాటిన తర్వాత పదేళ్ల వరకూ ఏటా రూ.4వేలు, పది నుంచి 12 ఏళ్ల మధ్యలో ఏటా రూ.5వేలు, పన్నెండేళ్లు దాటితే ఏటా రూ.6వేలు గ్రీన్‌ భారం ఇప్పుడు వసూ లు చేస్తున్నారు. మూడువేల కిలోల కన్నా తక్కువ బరువు ఉండే వాహనాలపై పన్ను ఉండబోదు. ఇకపై రవాణాయేతర వాహనాలకూ గ్రీన్‌ టాక్స్‌ రూ.10వేల వరకూ వసూలు చేయనుంది. పదిహేనేళ్లు దాటిన మోటార్‌ సైకిళ్లకు 20 ఏళ్ల వరకూ రూ.2వేలు, అంతకు మించితే రూ.5వేలు భరించాల్సిందే. మోటార్‌ బైకులు కాని ప్రతి వాహనానికీ అంటే కార్లు, జీపుల్లాంటి వాటికి 15-20 మధ్యలో రూ.5వేలు, ఇరవే ఏళ్లు దాటితే రూ.10వేలు తప్పక చెల్లించాల్సిందే.  

Updated Date - 2021-11-25T08:13:28+05:30 IST