కుర్రకారుకి విశాఖ సిటీ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , First Publish Date - 2022-06-26T22:07:03+05:30 IST
బైక్ రేసర్లు, కుర్రకారుకి విశాఖ సిటీ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్ సైలెన్సర్లు అమర్చితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విశాఖ: బైక్ రేసర్లు, కుర్రకారుకి విశాఖ సిటీ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్ సైలెన్సర్లు అమర్చితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖ బీచ్ రోడ్డులో సిటీ పోలీసుల వాహన తనిఖీలు చేశారు. సిటీ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ సమక్షంలో కార్యక్రమంను నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్లకు అమర్చిన సైలెన్సర్లను రోడ్డురోలర్తో సిటీ పోలీసులు ధ్వంసం చేయించారు. 631 బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్లతో తొక్కించి ధ్వంసం చేశారు.