గోరంట్ల రాసలీలలపై సిట్‌ను వేయాలి: రాఘవులు

ABN , First Publish Date - 2022-08-13T08:21:36+05:30 IST

గోరంట్ల రాసలీలలపై సిట్‌ను వేయాలి: రాఘవులు

గోరంట్ల రాసలీలలపై సిట్‌ను వేయాలి: రాఘవులు

విశాఖపట్నం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): స్టీల్‌ ప్లాంటును త్వరితంగా ప్రైవేటుకు అప్పగించేందుకు ఉద్దేశపూర్వకంగా దానిని కేంద్ర ప్రభుత్వం నష్టాలలోకి నెడుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది రూ.913 కోట్లు లాభం సాధించిన స్టీల్‌ప్లాంటును ఈ ఏడాది అత్యంత దారుణమైన స్థితికి తీసుకువచ్చారన్నారు. రోజుకు 24 వేల టన్నులు ఉత్పత్తి చేసే ప్లాంటులో ఇప్పుడు 10 వేల టన్నులకు మించి ఉత్పత్తి జరగడం లేదన్నారు. స్టీల్‌ప్లాంటు పరిరక్షణ విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ బాధ్యతగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ‘‘స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ మహానాడు, వైసీపీ ప్లీనరీలో తీర్మానం చేయకపోవడం దుర్మార్గం. ప్రైవేటీకరణ జరగడమే మంచిదనే ధోరణితో ఆ రెండు పార్టీలు ఉన్నాయనే భావం కలుగుతోంది. స్టీల్‌ప్లాంటుపై బీజేపీ రిఫరెండం పెట్టాలి. విశాఖపట్నంలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేసినప్పుడే ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేరినట్టు అవుతుంది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ రాసలీలలపై పూర్తి అధికారాలతో కూడిన సిట్‌ను వేసి విచారణ జరిపించాలి. లేకపోతే అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా వున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. బీజేపీ నిర్వహించాల్సింది... ఆజాదీ కా అమృతోత్సవ్‌ కాదు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం కాపాడడానికి సంకల్పోత్సవ్‌’’ అని రాఘవులు అన్నారు.

Updated Date - 2022-08-13T08:21:36+05:30 IST