AP News: ఆటోలు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-22T17:40:41+05:30 IST

ఆటో వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు.

AP News: ఆటోలు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

తణుకు(పశ్చిమగోదావరి జిల్లా): ఆటో వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీఐ ఆంజనేయులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన మేకల మోహన్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడి వద్ద రూ.12 లక్షల విలువైన ఆరు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. తణుకు పరిసర ప్రాంతాల్లో ఆటోలను చోరీ చేసి తెలంగాణ రాష్ట్రంలో విక్రయిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. రూరల్ ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు మోహన్‌కు సహకరించిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.

Updated Date - 2022-07-22T17:40:41+05:30 IST