డిప్యూటీ సీఎం బంధువు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-10-16T09:37:13+05:30 IST

డిప్యూటీ సీఎం బంధువు ఆత్మహత్యాయత్నం

డిప్యూటీ సీఎం బంధువు ఆత్మహత్యాయత్నం

చంద్రగిరి తహసీల్దార్‌ ఆఫీస్‌ ఆవరణలో ఘటన


చంద్రగిరి, అక్టోబరు 15: తనకు న్యాయం జరగడంలేదనే ఆవేదనతో.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి బంధువు, పిచ్చినాయుడుపల్లెకు చెందిన వాసు శనివారం ఆత్మహత్యకు యత్నించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అయితే.. వాసు పెట్రోలు పోసుకుని, నిప్పంటించుకునే ప్రయత్నం చేయడాన్ని.. గమనించిన రెవెన్యూ సిబ్బంది, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వాసు మీడియాతో మాట్లాడుతూ.. 1986లో ప్రభుత్వం తన తండ్రి ఈశ్వరయ్య పేరిట ఐదెకరాలకు డీకేటీ పట్టా ఇచ్చిందన్నారు. అయితే తమకు తెలియకుండానే అప్పటి రెవెన్యూ అధికారులు పట్టాను రద్దు చేయడంతో కోర్టుకు వెళ్లగా.. పట్టా ఇవ్వాలని తీర్పునిచ్చిందన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉండగానే.. తమ భూమిని.. శ్మశాన వాటికగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తనకు న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యే శరణమని భావించానన్నారు. దీనిపై తహసీల్దార్‌ శిరీషను వివరణ కోరగా.. రెవెన్యూ రికార్డుల్లో ఆ భూమి శ్మశానంగా ఉందన్నారు. 

Updated Date - 2022-10-16T09:37:13+05:30 IST