విశాఖ: సాగర్‌నగర్ సముద్ర తీరానికి ఆదివారం రాత్రి డాల్ఫిన్ కళేబరం ఒకటి కొట్టుకువచ్చింది. భారీ డాల్ఫిన్ కళేబరం తీరంలో కనిపించడంతో సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. శీతల మండలాలలో కనిపించే డాల్ఫిన్లు ఉష్ణ మండలాలలోని సముద్ర జలాల్లో సంచరించడానికి బాగా ఇష్టపడతాయి. దీంతో శీతల మండలం నుంచి ఉష్ణ మండలమైన విశాఖ తీరం వైపు ఇవి వస్తున్నప్పుడు కొన్ని రకాల వలలు, కాలుష్యం, తదితర కారణాలతో మృత్యువాత పడుతూ రుషికొండ, సాగర్‌నగర్ తీరాలకు చేరుతున్నాయి. డాల్ఫిన్లు సముద్ర జలాల్లో గంటకు 29 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయి. వీటికి వుండే శంఖాకార దంతాలను వినియోగించి చేపలను ఆహారంగా తీసుకుంటాయి.