మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యకాండకు కారణం ఏంటి?
ABN , First Publish Date - 2021-03-05T00:57:50+05:30 IST
ఏపీలో మున్సిపల్ ఎన్నిలకు సమయం దగ్గర పడింది. మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెల్లడిస్తారు. ఇప్పటికే...
అమరావతి: ఏపీలో మున్సిపల్ ఎన్నిలకు సమయం దగ్గర పడింది. మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెల్లడిస్తారు. ఇప్పటికే అన్ని పార్టీలు నామినేషన్లు వేశాయి. ఇక వైసీపీ అత్యధిక ఏకగ్రీవాలను తన ఖాతాలో వేసుకుంది. మూడు మున్సిపాలిటిలో మెజార్టీ వార్డులను కైవసం చేసుకుంది. అయితే ఏకగ్రీవాల కోసం వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. కొన్ని చోట్ల జరిగిన సంఘటనలపై టీడీపీ నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘‘మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యకాండకు కారణం ఏంటి?. ప్రతిపక్షాల అభ్యర్థులను బలవంతంగా ఎందుకు విత్ డ్రా చేయిస్తోంది?. ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని వైసీపీ భయపడుతోందా?. ఎన్నికల కమిషన్ ఆదేశాలను కూడా అధికారులు ఎందుకు లెక్క చేయడంలేదు?. ప్రచారంలో ఉండాల్సిన అభ్యర్థులు అజ్ఞాతంలో ఉండాల్సిన పరిస్థితులకు కారణాలేంటి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించారు. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.