ప్రధాని మోదీనే ఏపీని కొనియాడారు: ఆళ్లనాని

ABN , First Publish Date - 2020-09-30T23:26:55+05:30 IST

కరోనా కట్టడిలో సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారని డీప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ‘గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు సంఖ్య

ప్రధాని మోదీనే ఏపీని కొనియాడారు: ఆళ్లనాని

అమరావతి: కరోనా కట్టడిలో సీఎం జగన్  ఆదర్శంగా నిలిచారని డీప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ‘గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతోంది. సమర్థవంతంగా అధికారులు పని చేస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ చేపడుతున్న చర్యలను అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రకటనలు చేస్తున్నారు. లోకేష్ కూడా నివారణ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ జగన్‌కు మంచి పేరు వస్తుందో అని చంద్రబాబు, లోకేష్ ఆందోళన చెందుతున్నారు. ప్రజలు కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు అంటే అయన జూమ్ సందేశాలే కారణంగా చెప్పుకుంటున్నారు. ఆయనకు ఇలా చెప్పుకోవడం అలవాటే. కరోనా తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో మౌళిక సదుపాయాలు మెరుగుపరిచాం’ అని అన్నారు.


‘చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వెళ్లిపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం జగన్ మానిఫెస్టో‌లో హామీలు నెరవేరుస్తున్నారు. సంవత్సరం కాలంలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఏమి చేశారు. టీడీపీ కార్యకర్తల ద్వారా కోర్టులో కేసులు వేసి ఇళ్ళ పట్టాల పంపిణీ‌ని అడ్డుకున్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదు అని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. ప్రధాని సైతం ఏపీలో కరోనా నివారణ కార్యక్రమాలను కొనియాడారు. గ్రామ సచివాలయాలను ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించాలని ప్రధాని కోరడం గొప్ప విషయం. రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల కోట్లతో నాడు-నేడుతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎలాంటి వైరస్‌లు వచ్చినా ఎదుర్కునేలా మౌళిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నాం. ఐటీడీఏలో సైతం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నాం. క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ కూడా త్వరలో తీసుకువస్తాం. ఆరోగ్య శ్రీ కూడా పటిష్టంగా అమలు చేస్తున్నాం. ఇప్పటికైనా రాజకీయాలు ఆపకపోతే ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెబుతారు’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-09-30T23:26:55+05:30 IST