ఎన్‌ఎస్ ఐసీతో ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2022-09-23T10:55:12+05:30 IST

ఎన్‌ఎస్ ఐసీతో ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ ఒప్పందం

ఎన్‌ఎస్ ఐసీతో ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ ఒప్పందం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యరంగంలో సహకారం కోసం కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆధీనంలోని నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎ్‌సఐసీ)తో ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌(ఏఎంటీజడ్‌) ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి నారాయణ్‌ రాణే సమక్షంలో ఎంవోయూపై ఎన్‌ఎ్‌సఐసీ సీఎండీ గౌరంగ్‌ దీక్షిత్‌, ఏఎంటీజడ్‌ ఎండీ, సీఈవో జితేంద్ర శర్మ సంతకాలు చేశారు. ఆరోగ్యరంగంలోని ఎంఎ్‌సఎంఈల మధ్య పోటీతత్వం పెరగడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుందని నారాయణ్‌ రాణే తెలిపారు. ఈ రెండు సంస్థలు తమ నైపుణ్యాలను ఉపయోగించి ఎంఎ్‌సఎంఈల్లో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పాలని ఆకాంక్షించారు. వైద్య పరికరాల తయారీ, ఎగుమతుల్లో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలని రాణే సూచించారు. 


Updated Date - 2022-09-23T10:55:12+05:30 IST