ఏపీ శాసనమండలి బీఏసీలో గందరగోళం

ABN , First Publish Date - 2021-11-18T16:24:08+05:30 IST

ఏపీ శాసన మండలి బీఏసీలో గందరగోళం పరిస్థితి నెలకొంది. శాసన మండలి, శాసన సభ నిర్వహణపై చెరో రకమైన నిర్ణయం వెలువడింది.

ఏపీ శాసనమండలి బీఏసీలో గందరగోళం

అమరావతి: ఏపీ శాసన మండలి బీఏసీలో గందరగోళం పరిస్థితి నెలకొంది. శాసన మండలి, శాసన సభ నిర్వహణపై చెరో రకమైన నిర్ణయం వెలువడింది. ఈ నెల 26 వరకు శాసన సభ ఉంటుందని అసెంబ్లీ బీఏసీ నిర్ణయం తీసుకోగా... శాసన మండలి ఒక్కరోజు మాత్రమే అని మండలి బీఏసీలో ప్రకటించారు. ఇందుకు నిరసనగా మండలి బీఏసీ నుంచి కౌన్సిల్ ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వాక్ ఔట్ చేశారు. కాగా అసెంబ్లీ శాససభ సమావేశాల పొడిగింపుపై తమకు సమాచారం లేదంటూ... రెండోసారి మండలి బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-11-18T16:24:08+05:30 IST