జడ్జి సోదరుడిపై దాడి చేసింది టీడీపీ వాళ్లే: సుచరిత

ABN , First Publish Date - 2020-10-01T00:20:25+05:30 IST

సస్పెండైన జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి జరిగిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రామకృష్ణ సోదరుడిపై

జడ్జి సోదరుడిపై దాడి చేసింది టీడీపీ వాళ్లే: సుచరిత

గుంటూరు: సస్పెండైన జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి జరిగిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రామకృష్ణ సోదరుడిపై దాడికి పాల్పడిన వారు టీడీపీ వాళ్లే.. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. దాడికి పాల్పడిన ప్రతాప్‌రెడ్డి టీడీపీకి చెందిన వ్యక్తి అని తేలిందని చెప్పారు. అయినా కూడా విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై బురద జల్లి.. వైసీపీకి ఎస్సీలను దూరం చేసే కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. 


ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు, మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్టు అయితే బీసీలపై దాడి అంటున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అగ్ర ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. గతంలో ఎప్పుడైనా మార్కెట్ యార్డు చైర్మన్‌గా దళితులకు అవకాశం ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. కానీ ఇప్పుడు అన్ని వర్గాల వారికి పదవులు ఇచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందని చెప్పారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి చెబుతున్నారని వెల్లడించారు. చంద్రబాబు చెప్పే అసత్యాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు.

Updated Date - 2020-10-01T00:20:25+05:30 IST