జూనియర్ డాక్టర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు

ABN , First Publish Date - 2020-08-13T02:48:14+05:30 IST

జూనియర్ డాక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ డాక్టర్ స్టైఫండ్‌ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జనవరి 1 నుండి

జూనియర్ డాక్టర్లకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు

అమరావతి: జూనియర్ డాక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ డాక్టర్ స్టైఫండ్‌ను పెంచుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జనవరి 1 నుండి పెరిగిన స్టైఫండ్ అమలు కానుంది. వైద్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ ఉత్తర్వుల ప్రకారం ఎవరెవరికి ఎంత స్టైఫండ్ అంటే..

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ విద్యార్థులకు రూ.15,589

పీజీ ఫస్టియర్‌ విద్యార్థులకు రూ.44,075

పీజీ సెకండియర్‌ విద్యార్థులకు రూ.46,524

పీజీ మూడో సంవత్సరం విద్యార్థులకు రూ.48,973

పీజీ డిప్లొమా ఫస్టియర్‌- రూ.44,075, సెకండియర్‌- రూ.46,524

సూపర్‌ స్పెషాలిటీ ఫస్టియర్‌ విద్యార్థులకు రూ.48, 973

సూపర్‌ స్పెషాలిటీ సెకండియర్‌ విద్యార్థులకు రూ.51,422

సూపర్‌ స్పెషాలిటీ మూడో సంవత్సరం విద్యార్థులకు రూ.53,869

ఎండీఎస్‌ ఫస్టియర్‌- రూ.44,075, సెకండియర్‌- రూ.46,524

ఎండీఎస్‌ మూడో సంవత్సరం విద్యార్థులకు రూ.48,973 చొప్పున స్టైఫండ్‌ను ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2020-08-13T02:48:14+05:30 IST