అమరావతి : రేపు ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో రేపు సాయంత్రం భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో జగన్ చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఢిల్లీకి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ హస్తినకు పయనమవడం ఆసక్తికరంగా మారింది.