జగన్‌కు వ్యతిరేకంగా సీజేఐ బాబ్డేకు లేఖలు

ABN , First Publish Date - 2020-10-15T18:03:21+05:30 IST

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరును పలువురు న్యాయశాస్త్ర నిపుణులు, సీనియర్ అడ్వకేట్లు, రిటైర్డ్ జడ్జిలు మండిపడుతున్నారు.

జగన్‌కు వ్యతిరేకంగా సీజేఐ బాబ్డేకు లేఖలు

న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరును పలువురు న్యాయశాస్త్ర నిపుణులు, సీనియర్ అడ్వకేట్లు, రిటైర్డ్ జడ్జిలు మండిపడుతున్నారు. ఆయన తీరును ఖండిస్తూ సీజేఐ బాబ్డేకు లేఖలు రాశారు. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి నౌషద్‌ అలీ, సుప్రీంకోర్టు లాయర్‌ అశ్విని ఉపాధ్యాయ లేఖలు రాశారు. న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని జగన్‌ దిగజార్చుతున్నారని నౌషద్‌ అలీ పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై పథకం ప్రకారమే జగన్‌ దాడులు చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ సీజేఐకి లేఖ రాయడం గర్హనీయమని తెలిపారు. ముమ్మాటికీ తప్పేనన్నారు. జగన్‌పై ఉన్న 31 కేసుల్లో తీర్పులు చెప్పే.. న్యాయమూర్తులపై ఈ లేఖ ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. తన కేసుల్లో లబ్ధి కోసమే జగన్‌ ఇలాంటి లేఖలు రాస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థ పటిష్టతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 




ప్రజాప్రతినిధులపై కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్న తీర్పుతో.. జస్టిస్‌ ఎన్వీరమణపై జగన్‌ ఆగ్రహంగా ఉన్నారని సుప్రీంకోర్టు లాయర్‌ అశ్విని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థను గాడిలో పెట్టాలనుకుంటున్న.. జస్టిస్‌ ఎన్వీరమణపై ఆరోపణలు సరికాదన్నారు. ఫుల్‌ కోర్టును సమావేశపర్చి జగన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2020-10-15T18:03:21+05:30 IST