LIVE: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... టీడీపీ ఆందోళన

ABN , First Publish Date - 2022-09-15T14:43:51+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి.

LIVE: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... టీడీపీ ఆందోళన

అమరావతి: ఏపీ అసెంబ్లీ (AP Assembly session) సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే జాబ్ క్యాలెండర్ అని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం (AP Government)జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారిందంటూ టీడీపీ (TDP) ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni sitaram) తిరస్కరించారు. దీంతో శాసనసభలో టీడీపీ సభ్యులు (TDP MLAs) ఆందోళనకు దిగారు. వాయిదా తీర్మానాలపై చర్చకు టీడీపీ సభ్యులు (TDp Leaders) పట్టుబట్టారు. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

Updated Date - 2022-09-15T14:43:51+05:30 IST