కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-07T16:10:24+05:30 IST

పీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సభ మొదలవనుంది.

కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సభ మొదలవనుంది. తొలిసారిగా ఉభయ సభలకు గవర్నర్ హాజరుకానున్నారు. ఇప్పటి వరకు రెండుసార్లు వర్చువలుగా మాత్రమే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగంలో ఏయే అంశాలు ప్రస్తావిస్తారో అనే ఆసక్తి నెలకొంది. అభివృద్ధి వికేంద్రీకరణపై గవర్నర్ ప్రసంగంలో కీలక ప్రస్తావన ఉండే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంకానుంది. అసెంబ్లీ షెడ్యూల్‌‌ను బీఏసీ సమావేశంలో ఖరారు చేయనున్నారు. బీఏసీ మీటింగ్ ముగిసిన వెంటనే సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరుగనుంది. మరోవైపు ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపుతూ  టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లనున్నారు. 


Updated Date - 2022-03-07T16:10:24+05:30 IST