అంతర్వేది నూతన రథం నిర్మాణం ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-28T10:27:36+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి రథం దగ్ధం ఘటన అత్యంత దురదృష్టకరమని

అంతర్వేది నూతన రథం నిర్మాణం ప్రారంభం

అంతర్వేది, సెప్టెంబరు 27: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి రథం దగ్ధం ఘటన అత్యంత దురదృష్టకరమని, దీనిపై ఇప్పటికే సీబీఐ విచారణ జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతర్వేది నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్‌కి హిందూ సంస్కృతి, సంప్రదాయాలపై నిబద్ధత ఉందన్నారు. స్వామివారి కల్యాణం సమయానికి నూతన రథం సిద్ధం చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాదరావు, కొండేటి చిట్టిబాబు, పొన్నాడ సతీ్‌షకుమార్‌, ఏడీపీ రామచంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-28T10:27:36+05:30 IST