కౌలాలంపూర్: పీవీ సింధు, హెచ్‌ఎ్‌స ప్రణయ్ మలేసియా మాస్టర్స్ సూపర్-500లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమయ్యారు. మంగళవారం ప్రారంభమవనున్న ఈ పోటీల్లో సింధు తొలి రౌండ్లో తొమ్మిదో ర్యాంకర్ బింగ్ జియో (చైనా)ను ఎదుర్కోనుంది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్, సాయిప్రణీత్, సమీర్ వర్మ బరిలోకి దిగుతున్నారు. మహిళల డబుల్స్‌లో గాయత్రీ గోపీచంద్-ట్రీసా జాలీ జోడీతో పాటు సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప ద్వయం భారత్ నుంచి బరిలోకి దిగుతోంది.