Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంజూకు అరుదైన గౌరవం

వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ‘ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు  కైవసం

మొనాకో: భారత దిగ్గజ లాంగ్‌ జంపర్‌ అంజూ బాబీ జార్జ్‌కు అరుదైన గౌరవం లభించింది. యువ అథెట్లను తీర్చిదిద్దడంతోపాటు లింగ సమానత్వం కోసం గళం వినిపించినందుకుగాను వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ‘ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ఆమె సొంతమైంది. బుధవారం రాత్రి వర్చువల్‌గా జరిగిన వార్షిక అవార్డుల కార్యక్రమంలో 44 ఏళ్ల అంజూ ఈ అవార్డును దక్కించుకున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకున్న తొలి భారత అథ్లెట్‌గా అంజూ నిలిచింది. 2003 వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప లాంగ్‌ జంప్‌లో బాబీ కాంస్య పతకం సాధించింది. ఇటీవలే జరిగిన వరల్డ్‌ అండర్‌-20 అథ్లెటిక్స్‌లో రజతం సాధించిన షైలీ సింగ్‌.. అంజూ శిష్యురాలే. వరల్డ్‌ అథ్లెట్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఒలింపిక్‌ చాంపియన్లు ఎలైన్‌ థామ్సన్‌ హెరా (జమైకా), కర్సెటెన్‌ వార్‌హోమ్‌ (నార్వే) ఎంపికయ్యారు. గతంలో ఈ అవార్డులను వరల్డ్‌ అథ్లెటిక్స్‌ గాలా అవార్డులుగా పిలిచేవారు. 

Advertisement
Advertisement