Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీలో అంతా ఆయన ఇష్టమేనా!

అమరావతి: ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ పెద్దల పోకడలు రాష్ట్ర ప్రజలనే కాదు వైసీపీ ముఖ్య నాయకులను సైతం షాక్ గురి చేస్తున్నాయి. షాకిచ్చే నిర్ణయాలు విచిత్ర పోకడలు కొత్త కాకపోయినా ప్రభుత్వ స్థాయిలో ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో తెలియక అధికార పార్టీ నాయకులు అయోమయానికి గురవుతున్నారు. తాజాగా అసెంబ్లీ వేదికగా జరిగిన పరిణామాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. కీలక నిర్ణయాలపై కూడా తమకు కనీస సమాచారం ఇవ్వకపోవడం వారికి ఇబ్బందికరంగా మారింది. 


వరదల విషయంలో ప్రభుత్వ తీరు అటు బాధితులను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఇటు ఆయా ప్రాంతాల్లోని అధికార పార్టీ నేతలను సైతం డిఫెన్స్‌లో పడేసింది. సీఎం చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నాలుగు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాణ నష్టం జరిగితే సీఎం ఆయా గ్రామాలకు కూడా వెళ్లకపోవడంతో ఏం చెప్పాలో తెలియక స్థానిక ఎమ్మెల్యేలు జిల్లా మంత్రులు తలలు పట్టుకుంటున్నారు.


సీఎం, ప్రభుత్వ పెద్దల తీరు వైసీపీ స్థానిక నేతలను తీవ్ర అయోమయంలోకి పడేసిందని తెలుస్తోంది. ఓ పక్క  చంద్రబాబు గ్రామాల్లో తిరుగుతుంటే ఎలా కౌంటర్ ఇవ్వాలో కూడా వైసీపీ నేతలకు తెలియడం లేదు. తమకు అత్యంత బలమైన ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాల్లో ఇంత నష్టం జరిగితే ఇలా వ్యవహరించడం పార్టీకి మరింత చేటు చేస్తుందన్న భావన వారిలో నెలకొంది. 

Advertisement
Advertisement