సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీ ఉద్యోగ సంఘాలు

ABN , First Publish Date - 2022-01-19T23:04:43+05:30 IST

ద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ వివాదం చినికి చినికి గాలి వాన అయింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పునరాలోచించాలని,..

సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీ ఉద్యోగ సంఘాలు

అమరావతి: ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య  పీఆర్సీ వివాదం చినికి చినికి గాలి వాన అయింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పునరాలోచించాలని, పీఆర్సీ వల్ల తమ వేతనాలు తగ్గుతాయని భయాందోళన చెందుతున్నాయి. ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉద్యోగ సంఘాలను ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సీఎస్ ప్రకటనపై మండిపడుతున్నాయి. జీవో పతులను తగులబెట్టాయి. ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగేందుకు సిద్ధమవుతున్నాయి గురువారం కార్యచరణపై చర్చించనున్నాయి. శుక్రవారం ప్రభుత్వానికి నోటీసు ఇస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళేది లేదని, పీఆర్సీ జీవోలు రద్దు చేసిన తర్వాతే ప్రభుత్వంతో చర్చలకు వెళ్తామని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. 


సీఎస్ సమీర్ శర్మ వర్షన్ ఇలా ఉంది..

కొత్త పీఆర్సీతో ఉద్యోగుల వేతనాలు తగ్గవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టం చేశారు. సచివాలయంలో మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పీఆర్సీ పై క్లారిటీ ఇచ్చారు. ఐఆర్ అంటే వేతనంలో భాగం కాదన్నారు. ఆదాయాన్ని, ఖర్చులను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కష్ట కాలంలోనూ ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చామన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందన్నారు. 


‘‘2008-09 రెవెన్యూకి, ఇప్పటి రెవెన్యూకి చాలా తేడా ఉంది. ఇప్పుడు కొవిడ్ తీవ్రత ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఏపీ రెవెన్యూ గణనీయంగా పడిపోయింది. వాస్తవానికి రూ.98 వేల కోట్ల వరకు ఆదాయం రావాల్సింది. రూ.17 వేల కోట్ల మేర మధ్యంతర భృతి ఇచ్చాం. ఇది వేతనంలో భాగం కాదని వారికీ తెలుసు. పీఆర్సీ ఆలస్యమైన కారణంగా మధ్యంతర భృతి ఇచ్చాం. 2019 నుంచి గణించి డీఏలు, చెల్లింపు తదితర అంశాలను ప్రకటించాం. పెన్షన్‌, గ్రాట్యూటీలో కూడా పెరుగుదల ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్‌ వర్తింపజేస్తున్నాం. 2020-21లో ద్రవ్యలోటు 54.370 కోట్లుగా ఉంది. ఏ రాష్ట్రంలోనూ ఉద్యోగ విరమణ వయసు పెంచలేదు. ఏపీలో నియామకాలు ఉండవన్న ఆరోపణలు సరికాదు.’’ అని సమీర్ శర్మ అన్నారు. 


Updated Date - 2022-01-19T23:04:43+05:30 IST