సరిగా పనిచేయని అటెండెన్స్ యాప్... ఉపాధ్యాయుల ఆందోళన

ABN , First Publish Date - 2022-08-16T15:54:37+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఫేస్ రికగ్నేషన్ ద్వారా ఉపాధ్యాయులకు అటెండెన్స్ అమలులోకి రానుంది.

సరిగా పనిచేయని అటెండెన్స్ యాప్... ఉపాధ్యాయుల ఆందోళన

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఫేస్ రికగ్నేషన్ ద్వారా ఉపాధ్యాయుల (Teachers)కు అటెండెన్స్ అమలులోకి రానుంది. కాగా పలుచోట్ల అటెండెన్స్ యాప్ సరిగా పనిచేయకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కనిముషం ఆలస్యం అయినా ఆఫ్ డే లీవ్‌గా పరిగణిస్తామని పాఠశాల విద్యాశాఖ (School Education Department) స్పష్టం చేశారు. అయితే అటెండెన్స్ యాప్‌ను వినియోగించగా...  క్యాప్చా ఎర్రర్ అని చూపిస్తున్న వైనం నెలకొంది.  దీంతో ఏం చేయాలో అర్ధం కాక  ఉపాధ్యాయులు తలలుపట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. యాప్‌ల బాధ తప్పించాలంటూ విజ్జప్తి చేస్తున్నారు. తొలిరోజే ఏపీ సిమ్స్ యాప్ (AP Sims app)  ఫెయిల్ అయింది. సరైన సర్వర్ ఏర్పాటు చేయకపోవడంతో యాప్ ఫెయిల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. 

Updated Date - 2022-08-16T15:54:37+05:30 IST