ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు

ABN , First Publish Date - 2022-03-21T19:53:18+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. భానుడి భగ భగలతో ఏపీ ప్రజలు హడలిపోతున్నారు. బయటకు వస్తే చాలు.. మాడు పగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు రోడ్డుపైకి రావాలంటే జనం భయపడిపోతున్నారు. చాలా చోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా ఓ వైపు ఎండలు హడలెత్తిస్తుంటే.. మరోవైపు వానలు కురుస్తామని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం వాయుగుండంగామారి తుపానుగా మారే అవకాశముందని హెచ్చరికలు చేశారు.

Updated Date - 2022-03-21T19:53:18+05:30 IST