అమరావతి (Amaravathi): తిత్లీ తుఫాన్ (Titli Toofan) నష్ట పరిహరం పంపిణీలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ కేబినెట్ (AP Cabinet) నిర్ణయించింది. దీనికి సంబంధించి నిన్న జరిగిన మంత్రి వర్గం సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. నష్టపరిహారాన్ని రైతులకు పంపిణీ పేరుతో నిధులను పక్కదారి పట్టించారని జగన్ (Jagan) ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు రూ. 28 కోట్లు పంపిణీ చేసినట్లు లెక్కలు చూపారని అధికారులు తెలిపారు. నష్టపరిహారం పంపిణీలో అవకతవకలు జరిపి రికవరీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుందామని సమావేశంలో నిర్ణయించారు. కాగా ఎప్పుడో జరిగిన తిత్లీ తుపాన్‌కు సంబంధించి ఇప్పుడు నష్టపరిహారం అనర్హులకు అందిందని చెప్పి చర్యలు తీసుకోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి