అమరావతే అందరి మాట!

ABN , First Publish Date - 2020-07-05T08:55:00+05:30 IST

‘ఆంధ్రుల రాజధాని అమరావతి... అందరికీ అభివృద్ధి... అందరికోసం అమరావతి’ అనే నినాదం మార్మోగింది. రాజధాని గ్రామాల నుంచి అమెరికా నగరాల దాకా

అమరావతే అందరి మాట!

  • 200 రోజుల ఉద్యమానికి నీరాజనం
  • వైసీపీ మినహా అన్ని పార్టీల బాసట
  • జేఏసీ వర్చువల్‌ ర్యాలీ విజయవంతం
  • కమలం నేతల స్వరంలో పూర్తి స్పష్టత
  • గట్టిగా మద్దతిచ్చిన బీజేపీ నాయకత్వం
  • అమరావతి వెంటే మేం: పురందేశ్వరి
  • సీపీఎం మధు విస్పష్టమైన మద్దతు 
  • కలిసి వచ్చిన హిందూ మహాసభ
  • ‘దక్షిణాది అయోధ్య’గా అభివర్ణన
  • 250 ప్రదేశాల్లో జూమ్‌ ద్వారా వీక్షణ
  • ఫేస్‌బుక్‌ లైవ్‌లోనే లక్షన్నర వ్యూస్‌
  • ట్విటర్‌లో రెండు రోజులు ఇదే ట్రెండింగ్‌
  • విదేశాల్లోనూ ప్రవాసుల సంఘీభావం
  • అమరావతి బాధ్యత ప్రధానిది: బాబు


అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రుల రాజధాని అమరావతి... అందరికీ అభివృద్ధి... అందరికోసం అమరావతి’ అనే నినాదం మార్మోగింది. రాజధాని గ్రామాల నుంచి అమెరికా నగరాల దాకా అదే మాట వినిపించింది. ‘న్యాయం కావాలి. అమరావతి నిలవాలి’ అంటూ రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం శనివారానికి 200వ రోజుకు చేరుకుంది. కరోనా నిబంధనల నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు ఉదయం నుంచి సాయంత్రం దాకా తమ  నివాసాల్లోనే ఉపవాస దీక్ష చేశారు. అధికార వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు, పలు ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. జేఏసీ నిర్వహించిన ‘వర్చువల్‌ ర్యాలీ’ విజయవంతమైంది. కరో నా వ్యాప్తి తర్వాత స్తబ్దత నెలకొన్న అమరావతి ఉద్యమానికి ఈ కార్యక్రమం వేడి పెంచింది. ఎ క్కడివారు అక్కడే ఉండి ఫోన్లలో,  విజువల్‌ తె రలపై వీక్షించేలా ఈ ర్యాలీ నిర్వహించారు.  ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకూ వక్తల ప్రసంగాలు సాగాయి. జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీటిని ప్రసారం చేశారు.


సకల పక్షాల స్పష్టమైన మద్దతు

వర్చువల్‌ ర్యాలీలో వైసీపీ నుంచి రెబల్‌ ఎంపీగా ముద్రపడిన రఘురామ కృష్ణంరాజు సైతం అమరావతికి జైకొట్టారు. ‘‘నేను అమరావతి రాజధానికి మద్దతు ఇస్తున్నాను. 3 రాజధానులు తప్పనిసరి అనుకొంటే అమరావతిని పరిపాలనా రాజధానిగా చేయాలి. నేను మా పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. రాజధాని మార్పు మా పార్టీ వైఖరి కా దు. అది ఎన్నికల మ్యానిఫెస్టోలో లేదు. అది ప్రభుత్వ నిర్ణయం. అందుకే ప్రభుత్వానికి ఈ సూచన చేస్తున్నా’’ అని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు అమరావతికి మద్దతుగా కొంత గట్టిగా మాట్లాడారు.  సుజనా చౌదరితోపాటు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి కూడా ఉద్యమానికి మద్దతు ఇచ్చా రు. ఆర్‌ఎ్‌సఎస్‌ నేపథ్యం ఉన్న రతన్‌ శార్దా వంటి వారు మద్దతుపలికారు. అఖిలభారత హిందూసభ తరఫున మాట్లాడిన చక్రపాణి మహారాజ్‌, జీవీఆర్‌ శాస్త్రి వంటి వారు మరింత బలంగా అమరావతికి మద్దతు పలికారు. దక్షి ణ భారత రామాలయాన్ని అమరావతిలో నిర్మిస్తామని వారు ప్రకటించడం గమనార్హం. అమరావతి ఉద్యమంలో గతంలో అంత ప్రముఖం గా కనిపించని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కూడా వర్చువల్‌ ర్యాలీలో పాల్గొనడం విశేషం. మూడు రాజధానుల యోచన రాష్ట్రానికి పనికిరాదని ఆయన స్పష్టం చేశారు. సీపీఐ జా తీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మద్దతు తెలిపారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌ పార్టీ నేతలు తమ ప్రసంగాల్లో బీజేపీపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మౌన ప్రేక్షకురాలిగా ఉండటం సరికాదని, ప్రధాని వచ్చి శంకుస్థాపన చేసిన అమరావతి విషయంలో ఆ పార్టీ తన వైఖరి ఏమిటో స్పష్టంగా ప్రకటించాలన్నా రు. బీజేపీలో ఒక్కొక్కరు ఒకో రకంగా మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ చురకలు అంటించారు. బీజేపీ తరపున మాట్లాడిన పురందేశ్వరి.. తమ పార్టీలో జీవీఎల్‌ వం టివారు నిబంధనల గురించి మాత్రమే మాట్లాడారని, అమరావతి రాజధానిగా కొనసాగాలన్న అంశానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.


ట్విటర్‌లో ట్రెండింగ్‌

అమరావతి 200 రోజుల ఉద్యమం భారీగా ట్వీట్లు నమోదు అయిన అంశంగా ట్విటర్‌లో గుర్తింపు పొందింది. శుక్ర, శనివారం ట్విటర్‌లో 4 టాప్‌ ట్రెండింగ్‌ అంశాల్లో ఇదొకటిగా నిలిచిం ది. ఉద్యమంపై సుమారుగా 5,60,000 ట్వీట్లు వచ్చాయి. వర్చువల్‌ ర్యాలీని ఫేస్‌బుక్‌లో లక్షన్నర మంది వీక్షించారు. 3 ప్రధాన పేజీల్లో ఈ సంఖ్య నమోదైంది. జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాన్ని 250 ప్రదేశాల్లో వినియోగించుకొని ఈ ర్యాలీని చూశారు.

Updated Date - 2020-07-05T08:55:00+05:30 IST