అనంతపురం జిల్లా వైద్యాధికారి అనిల్‌కుమార్‌కు అస్వస్థత

ABN , First Publish Date - 2020-04-10T18:05:01+05:30 IST

అనంతపురం : జిల్లా వైద్యాధికారి అనిల్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.

అనంతపురం జిల్లా వైద్యాధికారి అనిల్‌కుమార్‌కు అస్వస్థత

అనంతపురం : జిల్లా వైద్యాధికారి అనిల్‌కుమార్‌ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. పొరపాటున నీళ్లకు బదులు శానిటైజర్‌ తాగారు. అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనిల్‌ చికిత్స తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువ కావడం, పని ఒత్తిడి కారణంగా అనిల్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు ఆస్పత్రికి వెళ్లి అనిల్‌ను పరామర్శించారు. 


కాగా.. రోజురోజుకూ అనంతలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్కరోజే రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్‌లో ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకూ జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15. ఇదిలా ఉంటే.. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా.. 10మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Updated Date - 2020-04-10T18:05:01+05:30 IST