పోలీసుల రక్షణతో.. మీడియాకు తెలియకుండా అమృత ఇలా...

ABN , First Publish Date - 2020-03-15T03:08:12+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యకేసులోని ప్రధాన నిందితుడు..

పోలీసుల రక్షణతో.. మీడియాకు తెలియకుండా అమృత ఇలా...

నల్గొండ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యకేసులోని ప్రధాన నిందితుడు మారుతీరావు కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తండ్రిని కడసారి చూడటానికి వెళ్లిన అమృతను కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకోవడంతో వెనుదిరిగింది.


శనివారం నాడు సాయంత్రం మీడియా కంట పడకుండా.. పోలీసుల రక్షణతో మిర్యాలగూడలోని తల్లి గిరిజ నివాసానికి అమృత వెళ్లింది. తన ఇంటి నుంచి కారులో తన కొడుకుతో కలిసి అమృత వెళ్లగా.. వెనుక పోలీసులు ఫాలో అవుతూ వచ్చారు.! అయితే తల్లిని కలుస్తున్నాన్న విషయాన్ని అమృత మీడియాకు చెప్పలేదు. అంతేకాదు.. తల్లిని కలిసిన తర్వాత మీడియాతో కూడా అమృత మాట్లాడలేదు. మీడియాను రానివ్వద్దని పోలీసులకు చెప్పి తల్లిని కలిసిందని సమాచారం.


ఇవాళ 5:30 గంటల ప్రాంతంలో..!

ఇవాళ తన కుమారుడ్ని తీసుకుని తల్లి వద్దకు వెళ్లింది. అమృతను చూసిన గిరిజ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. సుమారు పావుగంట పాటు తల్లి-అమృత ఇద్దరు మాట్లాడుకున్నారు. తల్లిని పరామర్శించిన అనంతరం మారుతీరావు నివాసం నుంచి పోలీసుల రక్షణతో తిరిగి తన అత్తారింటికి అమృత వెళ్లిపోయింది. ఇవాళ సాయంత్రం 05:30 గంటల ప్రాంతంలో అమృత తన తల్లికి దగ్గరికి వెళ్ళిందని తెలుస్తోంది. స్థానికులు చెప్పడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. 


మారుతీరావు ఫ్లాట్ల పరిశీలన..!

ఇదిలా ఉంటే.. నిన్న నాగార్జుననగర్ లో తన తండ్రి మారుతీరావుకు చెందిన ప్లాట్స్ ను అమృత పరిశీలించింది. ఓ వ్యక్తి బైక్ పై అక్కడికి వచ్చిన అమృత ఆ ప్లాట్స్ ఫొటోస్ తీసుకున్నది. కొన్ని సెల్ఫీస్ కూడా తీసుకున్నది. స్థానికులు కొందరు అమృతను కెమెరాలతో ఫొటోలు తీయడంతో ఈ విషయం వెలుగుచూసింది.



నాన్న కోరిక మేరకు..!

కాగా.. మారుతీరావు ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. ‘గిరిజ క్షమించు.. తల్లి అమృతా దగ్గరికి వెళ్లిపో’ అని సూసైడ్ నోట్‌లో రాసి ఉంది. తండ్రి చివరిగా అమ్మదగ్గరికి వెళ్లమని చెప్పడంతో.. ఆ మాటను దృష్టిలో ఉంచుకుని గిరిజను అమృత కలిసినట్లు తెలుస్తోంది. అయితే.. తండ్రిని చూడటానికి వెళ్లగా.. బంధువులు అడ్డుకోవడంతో ఇవాళ పోలీసుల రక్షణతో తల్లిని అమృత కలిసింది.

Updated Date - 2020-03-15T03:08:12+05:30 IST