అమరావతి: గన్నవరం ఎయిర్‌పోర్టుకు కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం నుంచి గన్నవరం విమానాశ్రయానికి 2,88,000 టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‌ను అధికారులు తరలించారు. గన్నవరం టీకా కేంద్రం నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో వ్యాక్సిన్ డోసులు జిల్లాలకు తరలివెళ్లనున్నాయి.