Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేడు సీమలో భారీ వర్షాలు

అమరావతి, విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల ఉపసంహరణ, ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు నెలకొనడంతో వాతావరణంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. దీనికితోడు ఎండ తీవ్రత, ఉక్కపోత పెరగడంతో క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించి శుక్రవారం సాయంత్రం ఉత్తరకోస్తా, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీవర్షం కురిసింది. రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో అక్కడక్కడా భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కాగా, శ్రీశైలానినికి జూరాల, సుంకేసుల ప్రాజెక్టు నుంచి 12,884 క్యూసెక్కుల నీరు చేరుతోంది.

Advertisement
Advertisement