అమెజాన్ ‘సమ్మర్’ ఆఫర్...

ABN , First Publish Date - 2021-02-26T23:23:29+05:30 IST

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్... భారీ ఆఫర్లను ప్రకటించింది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీగా ఈ రాయితీలుండనున్నాయి. ఈ ఆఫర్లు ఈ రోజు(ఫిబ్రవరి 26) ) ప్రారంభం కాగా, 28 వ తేదీ వరకు అమల్లో ఉంటాయి.

అమెజాన్ ‘సమ్మర్’ ఆఫర్...

 ముంబై : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్... భారీ ఆఫర్లను ప్రకటించింది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీగా ఈ రాయితీలుండనున్నాయి. ఈ ఆఫర్లు ఈ రోజు(ఫిబ్రవరి 26) ) ప్రారంభం కాగా, 28 వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. ‘సమ్మర్ అప్లయన్స్ ఫెస్టివల్’  పేరుతో వోల్టాస్, ఎల్జీ, డాకిన్, వర్ల్‌ఫూల్, శామ్సంగ్, సింఫనీ, గోద్రేజ్, కంపెనీలకు చెందిన బ్రాండ్లపై అమెజాన్ పెద్దమొత్తంలో రాయితీలను ప్రకటించింది. అంతేకాకుండా...  కొనుగోలుదారులు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసినపక్షంలో... ఈఎంఐలపై 10 శాతం(రూ . 1,500 వించకుండా) అదనంగా డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. 


ఎయిర్ కండీషనర్లు... టాప్ ఆఫర్లు... 

వోల్టాస్, డాకిన్, ఎల్‌జి, వర్ల్‌పూల్, సాన్యో, తదితర బ్రాండ్లకు చెందిన ఎయిర్ కండీషనర్లపై 40 % వరకు రాయితీ ప్రకటించింది. అయితే, ఈ బ్రాండ్ల ప్రారంభ ధరను మాత్రం రూ . 22,999 గా నిర్ణయించింది. విండో ప్రారంభం ధర ధర రూ.  17,490. అమెజాన్ ఏసీ మోడళ్లను బట్టి వాటి బేసిక్ ప్రైస్‌ను రూ  .22,499 గా నిర్ణయించింది. ఎల్‌జి, వోల్టాస్, పానాసోనిక్, టీసీఎల్ వంటి బ్రాండ్లకు సంబంధించి ఎస్‌బీలు, స్మార్ట్ ఏసిలలో 50 కి పైగా కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసువకుచ్చింది.


టాప్ వోల్టాస్, ఎల్జీ, పానాసోనిక్, ఐఎఫ్‌బీ వంటి బ్రాండ్లతో పాటు.. ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి వస్తున్న మిడియా, హిస్సెన్స్, లివ్‌పోర్‌ వంటి కొత్త బ్రాండ్లను 80 కి పైగా అమ్మకానికి తీసుకువచ్చింది. వోల్టాస్ ఏసీ 1.4 టన్నుల విభాగంలో నాలుగు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. 


ఇక రిఫ్రిజిరేటర్లలో టాప్ ఆఫర్లు ఇవే...

ఎల్జీ, శామ్‌సంగ్, వర్ల్‌పూల్, హైయర్, గోద్రేజ్ తదితర బ్రాండ్ల రిఫ్రిజిరేటర్లపై 35 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. తక్కువ విద్యుత్తును వినియోగించుకునే  రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర రూ. 13,790 గా పేర్కొంది. ఆ తర్వాతి శ్రేణి రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర రూ . 21,290  గా నిర్ణయించింది. మరోవైపు...  ఎక్సేంజ్‌పై కూడా రూ .  12 వేల వరకు రాయితీలనిస్తోంది. రిఫ్రిజిరేటర్లలో 60 కి పైగా కొత్త బ్రాండ్‌లపై కనీసం 10 శాతం తగ్గింపునిస్తోంది. వర్ల్‌పూల్, శామ్‌సంగ్, ఎల్‌‌జీ, గోద్రేజ్, హైయర్ తదితర బ్రాండ్లలోనూ కొత్త మోడళ్లను ప్రవేశపెడుతోంది.


కూలర్లు, యాక్సెసరీస్‌పై భారీగా రాయితీలు... 

సింఫనీ, క్రాంప్టన్, బజాజ్, హావెల్స్ టాప్ బ్రాండ్లపై 50 % వరకు తగ్గింపునిస్తోంది. ఓరియంట్ తదితర బ్రాండ్లను విక్రయానికి ఉంచింది.


Updated Date - 2021-02-26T23:23:29+05:30 IST