America లోని ఎన్నారైలకు గుడ్‌న్యూస్.. దాదాపు పదేళ్ల తర్వాత..

ABN , First Publish Date - 2021-11-16T03:00:06+05:30 IST

అమెరికాలోని ప్రవాసీ భారతీయులకు ఓ శుభవార్త. దాదాపు పదేళ్ల తరువాత అమెరికా ఎయిర్‌లైన్స్ భారత్‌కు విమానసర్వీసులను పునరుద్ధరించింది. దీంతో.. అమెరికా-భారత్ మధ్య నిరంతరాయ విమానయాన సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్టైంది. ఆమెరికా ఎయిర్‌లైన్స్‌కు చెందిన తొలి విమానం శనివారం నాడు న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.

America లోని ఎన్నారైలకు గుడ్‌న్యూస్.. దాదాపు పదేళ్ల తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ప్రవాసీ భారతీయులకు ఓ శుభవార్త. దాదాపు పదేళ్ల తరువాత అమెరికా ఎయిర్‌లైన్స్ భారత్‌కు  విమానసర్వీసులను పునరుద్ధరించింది. దీంతో.. అమెరికా-భారత్ మధ్య నిరంతరాయ విమానయాన సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్టైంది. ఆమెరికా ఎయిర్‌లైన్స్‌కు చెందిన తొలి విమానం శనివారం నాడు న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. 


వాస్తవానికి ఈ సర్వీసు ఈ అక్టోబర్‌లోనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. నవంబర్ 8నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు ఆంక్షలు తొలగిపోతాయని అమెరికా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కొన్ని వారాల పాటు సర్వీసుల పునరుద్ధరణ వాయిదా పడింది. ఇక బెంగళూరు-సియాటిల్ సర్వీసును తొలుత 2022 జనవరిలో ప్రారంభించాలని సంస్థ అనుకున్నప్పటికీ చివరికి మార్చిలో ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చింది. అప్పటికి కార్పొరేట్ ప్రయాణాలు ఊపందుకుంటాయన్న ఆలోచనతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ 2012లో చివరిసారిగా చికాగో-ఢిల్లీ సర్వీసును నడిపింది. 


కాగా.. ఈ సర్వీసుకు భవిష్యత్తులో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని సంస్థ సేల్స్ విభాగం ఎండీ టామ్ లాటిగ్ వ్యాఖ్యానించారు. అమెరికా-భారత మధ్య పెరుగుతున్న ఆర్థిక బంధాలు, అక్కడ ప్రవాసీ భారతీయులు అధికంగా ఉండటం వంటివి దీనికి దోహదపడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో సర్వీసుల విస్తరణకు కూడా ఎంతో అవకాశం ఉందన్నారు. అయితే.. ఈ రెండు సర్వీసులకు కస్టమర్ల నుంచి వస్తున్న స్పందనను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఢిల్లీ రూట్‌లో బోయింగ్ 777 విమానాన్ని వినియోగించేందుకు అమెరికా ఎయిర్‌లైన్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-11-16T03:00:06+05:30 IST