భార‌త్ బాట‌లోనే అమెరికా.. 'టిక్‌టాక్' బ్యాన్ !

ABN , First Publish Date - 2020-08-08T13:05:45+05:30 IST

దేశ భద్రతా కారణాల దృష్ట్యా చైనా యాప్‌లను నిషేధించిన భారత్‌ను అమెరికా అనుసరించింది. టిక్‌టాక్‌, వియ్‌చాట్‌ యాప్‌లను నిషేధిస్తూ అధ్యక్షుడు ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు.

భార‌త్ బాట‌లోనే అమెరికా.. 'టిక్‌టాక్' బ్యాన్ !

వాషింగ్టన్‌: దేశ భద్రతా కారణాల దృష్ట్యా చైనా యాప్‌లను నిషేధించిన భారత్‌ను అమెరికా అనుసరించింది. టిక్‌టాక్‌, వియ్‌చాట్‌ యాప్‌లను నిషేధిస్తూ అధ్యక్షుడు ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించినందున ఆ యాప్‌లపై 45 రోజుల్లో నిషేధం అమల్లోకి రావాలని ఆ ఉత్తర్వుల్లో ట్రంప్‌ ఆదేశించారు. టిక్‌టాక్‌ సహా 106 చైనా యాప్‌లను భారత్‌ నిషేధించడాన్ని ట్రంప్‌ యంత్రాంగం సహా కాంగ్రెస్‌ ప్రతినిధులంతా స్వాగతించిన విషయం తెలిసిందే. ‘దేశ భద్రతను పరిరక్షించాలంటే యూఎస్‌ టిక్‌టాక్‌ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికాలో నెలకు 8 కోట్ల మంది వరకు టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారని అంచనా.  

Updated Date - 2020-08-08T13:05:45+05:30 IST