రూ.2.59 లక్షల కోట్ల డీల్‌!

ABN , First Publish Date - 2020-10-28T08:08:15+05:30 IST

కంప్యూటర్‌ చిప్‌ల తయారీ సంస్థ ఏఎండీ.. తన ఇండస్ట్రీకే చెందిన మరో సంస్థ జిలింక్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ 3,500 కోట్ల డాలర్లు...

రూ.2.59 లక్షల కోట్ల డీల్‌!

  • ఏఎండీ చేతికి జిలింక్స్‌ 


శాన్‌జోస్‌: కంప్యూటర్‌ చిప్‌ల తయారీ సంస్థ ఏఎండీ.. తన ఇండస్ట్రీకే చెందిన మరో సంస్థ జిలింక్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ 3,500 కోట్ల డాలర్లు (రూ.2.59 లక్షల కోట్లు). పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా జరగనున్న లావాదేవీ ద్వారా ఈ రెండు చిప్‌ తయారీ సంస్థలు ఏకం కానున్నాయి. తన ప్రధాన ప్రత్యర్థి అయిన ఇంటెల్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు ఏఎండీకి ఈ డీల్‌ ఎంతగానో దోహదపడనుంది. జిలింక్స్‌ కొనుగోలు ద్వారా అధిక పనితీరు కనబర్చే ప్రాసెసర్ల పోర్ట్‌ఫోలియో  చేజిక్కనుంది. ఈ ఒప్పందంలో భాగంగా జిలింక్స్‌ షేర్‌హోల్డర్లకు తమ వద్దనున్న ఒక్కో షేరుకు గాను ఏఎండీకి చెందిన 1.7234 షేర్లు లభించనున్నాయి. లేదా ఒక్కో జిలింక్స్‌ షేరుకు గాను 143 డాలర్లు లభించనున్నాయి. 


Updated Date - 2020-10-28T08:08:15+05:30 IST