Abn logo
May 14 2021 @ 09:33AM

విజయవాడ రామాపురంలో నిలిచిన అంబులెన్స్‌లు

విజయవాడ: రామాపురం క్రాస్‌రోడ్ వద్ద అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. ఏపీ నుంచి వెళ్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు వెనక్కి పంపుతున్నారు. విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన వినోద అనే వృద్ధురాలికి పక్షవాతం వచ్చింది. హైదరాబాద్‌లోని ఆస్పత్రి పత్రం చూపినా తెలంగాణ పోలీసులు అనుమతించడం లేదు. పరిస్థితి విషమంగా ఉంటే ఆంక్షలేంటని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ అంబులెన్స్‌లను కూడా తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. పేషెంట్లను వదిలివస్తున్న అంబులెన్స్‌లను నిలిపివేయడంపై డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement